నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రస్తుత పాలకులు ఇంకెంతకాలం ప్రజలను మోసగిస్తారంటూ డిఎంకేపై టీవీకే అధినేత, నటుడు విజయ్ మండిపడ్డారు. ‘అధికారంలోకి వస్తే నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేస్తామని 2021 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రద్దు చేయించే సీక్రెట్ తెలుసని ఊదరగొట్టారు. ఇప్పుడేమో నీట్‌ను రద్దుచేసే అధికారం కేంద్రానిదే అంటున్నారు. దీనికోసమే మీకు ఓటేసిన వారిని ఇది మోసం చేసినట్టు కాదా’ అని ప్రశ్నించారు. తమిళంలో ఓ పాట లిరిక్స్‌ను షేర్ చేశారు.