బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే..?

నవతెలంగాణ-హైదరాబాద్ : కొల్లాపూర్‌ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క (శిరీష) విజయం సాధిస్తుందా? గురువారం ముగిసిన పోలింగ్‌లో ఆమెకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయి? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరీ ముఖ్యంగా పోలింగ్ ముగిసిపోవడంతో బర్రెలక్క గెలుపుపై అంచనాలు ఏవిధంగా ఉన్నాయనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వెలువడిన ‘ఆరా మస్తాన్ సర్వే’ శిరీషకు 15 వేల వరకు ఓట్లు రావొచ్చని లెక్కగట్టింది. శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్టరావు గెలుపొందనున్నారని విశ్లేషించింది.

Spread the love