తొలిసారి ఓటు వేయనున్న యువత ఎంత మందంటే?

నవతెలంగాణ ఢిల్లీ:  ప్రతీ ఎన్నిక ఒక పరీక్ష లాంటిదేనని, ప్రతీ పరీక్షలోనూ విజయం సాధించాలనేది ఈసీ లక్ష్యమని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలు అని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 2024ను ఎన్నికల సంవత్సరంగా పిలవొచ్చన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు ఇంటి నుంచి ఓటువేసే అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

ఓటర్ల వివరాలు

మొత్తం ఓటర్లు – 96.8కోట్లు
పురుషులు- 49.7 కోట్లు
మహిళలు- 47.1 కోట్లు
ట్రాన్స్‌జెండర్స్‌- 48,000
85+ వయసు దాటిన ఓటర్లు – 82 లక్షలు
20-29 మధ్య వయసున్న ఓటర్లు -19.74 కోట్లు
18-19 మధ్య వయసున్న ఓటర్లు – 1.8 కోట్లు

నిర్వహణ
 ఈవీఎంలు – 55 లక్షలు
పోలింగ్ కేంద్రాలు – 10.5 లక్షలు
1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది

Spread the love