నవతెలంగాణ – రామడుగు
ఇటీవల కురుస్తున్న వర్షాలకు మండలంలని మోతె తాళ్ళల్లోని లెవెల్ వంతెన వద్ద కొత్తపల్లి, షానగర్ ప్రధాన రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డుపై వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోందంటూ, ఫోర్‌వీలర్స్‌లో వెళ్లాలంటే గుంతల్లో దిగుబడి పోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు రోడ్డు మర్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.