న్యూఢిల్లీ: చమురు ఉత్పత్తుల కంపెనీ మోబిల్ తన బ్రాండ్ అంబా సీడర్‌గా హృతిక్ రోషన్‌ను నియమించుకున్నట్లు తెలిపింది., ”భారత్‌లో మోబిల్ లూబ్రికెంట్స్ కోసం హృతిక్ రోషన్‌తో భాగస్వామ్యం మాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దేశ లూబ్రికాంట్ అవసరాలను పూరిస్తామనే మా మాటకు వ్యాపార భాగస్వాములు, వినియోగదారులలో విశ్వాసం కలిగించేలా హృతిక్ వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని మేము నమ్ముతున్నాము.” అని ఎక్సాన్ మొబిల్ లూబ్రికెంట్స్ సిఇఒ విపిన్ రాణా పేర్కొన్నారు.