– ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్
దుబాయ్ : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హెచ్.ఎస్ ప్రణయ్ కెరీర్ అత్యుత్తమ ప్రపంచ ర్యాంక్ సాధించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యూఎఫ్) మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణయ్ ఏడో స్థానం సాధించాడు. రెండు స్థానాలు ఎగబాకిన హెచ్.ఎస్ ప్రణయ్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ 8 సాధించాడు. యువ షట్లర్ లక్ష్యసేన్ టాప్-10లో చోటు కోల్పోయాడు. భారత్ నుంచి టాప్-10లో కొనసాగుతు న్న ఏకైక షట్లర్‌గా కేరళ స్టార్ ప్రణరు నిలిచాడు. మహిళల డబుల్స్ విభాగంలో యువ జోడీ ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి ఉత్తమ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇటీవల మెరుపు విజయాలు నమోదు చేసిన ట్రెసా, గాయత్రి జోడీ 17వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్‌కు చేరుకుంది. మెన్స్ సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్, స్టార్ షట్లర్ లక్ష్యసేన్ టాప్-20లో సైతం నిలువలేదు. లక్ష్యసేన్, శ్రీకాంత్ వరుసగా 22, 23వ స్థానాల్లో కొనసాగుతున్నారు. మహిళల సింగిల్స్ విభాగం లో పి.వి సింధు ఓ ర్యాంక్ మెరుగైంది. 11వ స్థానంలో నిలిచి టాప్-10కు చేరువైంది. మాజీ వరల్డ్ నం.1 సైనా నెహ్వాల్ 36వ స్థానంలోనే కొనసాగుతుంది. మెన్స్ డబు ల్స్ విభాగంలో సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానంలో నిలిచింది.