– సీఐ హామీతో ఆందోళన విరమణ
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని హిందువుల ఆరాధ్య దైవం బారడి పోచమ్మ ఆలయంలో హిందువులకు కించపరుస్తూ మాంసం మొక్కలు పెట్టిన దానికి నిరసనగా రెండు రోజుల క్రితం మద్నూర్ గ్రామస్తులు భారీగా ఆందోళన చేస్తూ మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. హిందూ ఆలయానికి అవమానపరిచిన వ్యక్తికి వెంటనే అరెస్టు చేసి ప్రజాదర్బార్లో శిక్షించాలని డిమాండ్ చేయగా అలాంటిదేమీ లేకుండా మాంసం ముక్కలు పెట్టిన వ్యక్తికి గుట్టు చప్పుడు కాకుండా అరెస్టు చేసి పంపినట్లు తెలిసిన సమాచారం పై గ్రామ ప్రజలంతా గురువారం నాడు భారీ ఆందోళన చేపడుతూ.. మద్నూర్ లో బందు నిరసన కార్యక్రమం చేపట్టారు పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో ఆందోళన చేయగా ఎస్సై కృష్ణారెడ్డి ఆ కేసు విషయంలో ఎంత నచ్చ చెప్పిన వినకపోవడంతో బిచ్కుంద సీఐ హుటా కొట్టిన మద్నూర్ కు వచ్చి హిందువుల ఆరాధ్య దైవం భారతి పోచమ్మ గుడిలో మాంసం ముక్కలు పెట్టిన కేసు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సిఐ ఇచ్చిన హామీకి గ్రామస్తులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.