చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా నగదు స్వాధీనం

నవతెలంగాణ – చెన్నై
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా నగదు పట్టుబడింది. చెన్నైకి చెందిన 32 ఏళ్ల మహిళ బ్యాగులో సోదా చేయగా రూ.20 లక్షల నగదు కనిపించింది. దర్యాప్తులో ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి సింగపూర్‌లో మరొకరికి ఇవ్వాలని చెప్పాడని, అలా చేస్తే తనకు రూ.10 వేలు ఇస్తానని చెప్పినట్లు సదరు మహిళ తెలిపింది. దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.
Spread the love