ఖమ్మంలో భారీగా పట్టుపడిన నగదు

నవతెలంగాణ ఖమ్మం: లోక్ సభ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. జిల్లాలోని కూసుమంచి మండలం దేవుని తండా వద్ద కారు నుంచి సుమారు రూ.1.5కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో నగదు తీసుకెళ్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు కారును గుర్తించి వెంబడించారు. దీంతో వారు కారును వేగంగా నడపడంతో అదుపుతప్పి దేవుని తండా వద్ద బోల్తాపడింది. కారులో రెండు బ్యాగుల్లో కరెన్సీ కట్టలు ఉండటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని లెక్కించారు. సుమారు రూ. 1.5కోట్ల నగదు ఉన్నట్టు తేల్చారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవటంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. కారులో డబ్బును తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love