విశాఖలో భారీగా నగదు పట్టివేత..

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ రేపు ఉదయం 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖలో ఫ్లైయింగ్ స్వ్కాడ్ ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టగా ఓ కారు పాండురంగాపురం వైపు వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా రూ.1.5 కోట్ల నగదును అందులో గుర్తించారు. అనంతరం పోలీసులు కళ్లు గప్పి నగదును తరలిస్తున్న నిందితులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి గురించి గాలిస్తున్నారు.

Spread the love