తిరుమలకు రూ. 6 కోట్ల భారీ విరాళం..

Tirumala Rs. 6 crore huge donation.. నవతెలంగాణ – అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని ట్రస్టులకు ఏకంగా రూ.6 కోట్ల విరాళం ఇచ్చారు. ఇందులో ఎస్వీబీసీ (చానల్)కి రూ.5 కోట్లు, శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. వర్ధమాన్ జైన్ విరాళం చెక్కులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. వర్ధమాన్ జైన్ కుటుంబం గతంలోనూ టీటీడీకి భారీ విరాళాలు అందించినట్టు తెలుస్తోంది.

Spread the love