శంషాబాద్ విమానాశ్రయంలో భారీ డ్రగ్‌ పట్టివేత

నవతెలంగాణ -హైదరాబాద్‌: హైదరాబాద్‌ :శంషాబాద్ విమానాశ్రయంలో భారీ డ్రగ్‌ పట్టివేత. పెద్దఎత్తున కొకైన్‌ తీసుకొస్తుండగా దర్యాప్తు సంస్థ పట్టుకొంది. డీఆర్‌ఐకి అందిన విశ్వసనీయ సమాచారంతో విమానాశ్రయంలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల కొకైన్‌ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.50 కోట్లు. ఓ సూట్‌కేస్‌తోపాటు మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్‌బ్యాగ్‌ల అడుగు భాగంలో ఈ సరకును పొడిరూపంలో ఉంచి తీసుకొచ్చారు. ఇవి లావోస్‌ నుంచి సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడివిగా గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న ఆ ప్రయాణికుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Spread the love