హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. శనివారం పోలీసులు మాదాపూర్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్‌ను గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువస్తున్న సాయిచరణ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా నిందితుడు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురితో పాటు ప్రధాన నిందితుడు సాయిచరణ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖలో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిపారు. రాజేశ్వరి ట్రావెల్స్, జీవీఆర్, స్టార్ట్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.

Spread the love