నవతెలంగాణ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరుపుల గోదాంలో చెలరేగిన మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్టు అనుమానిస్తున్నారు.