నవతెలంగాణ – హైదరాబాద్: కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు రేగింది. లాస్ ఏంజెల్స్ సమీపంలోనున్న పర్వత ప్రాంతాల్లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 10 వేల మందిని నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 3500 కమ్యూనిటీల్లో ఉన్నవారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. కార్చిర్చు కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. వేలాదిమంది పౌరులు అంధకారంలో మగ్గుతున్నారు. కార్చిర్చును ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మంటలను అదుపుచేయడం ఫైర్ సిబ్బందికి సవాలుగా మారింది.