నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్పీ ఫేజ్-బీ లోని ఓ అపార్ట్మెంట్స్ లోని 16/11 ఫ్లాట్ ను షణ్ముఖ పవన్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్స్ స్టాక్ రూమ్ గా వినియోగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఆ ఫ్లాట్స్ నుండి భారీగా మంటలు చెలరేగి, పక్క ఫ్లాట్స్ కు విస్తరించాయి. స్థానికులు, అపార్ట్మెంట్ వాసులు మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అంతకంతకూ మంటలు వేగంగా విస్తరించడంతో అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. వందల ఫోన్లు, బ్యాటరీలు మంటల్లో పూర్తిగా ఖాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమనిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేపడతామని తెలిపారు.