భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత..

నవతెలంగాణ – హైదరాబాద్: గంజాయి తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు రూ. కోటి విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఈ ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. రూ. కోటి విలువైన గంజాయిని తరలిస్తున్న వారిలో నిజామాబాద్‌ కార్పొరేటర్ కొడుకును చేసిన ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా పదేళ్ల నుంచి గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు కార్పొరేటర్ కొడుకు మునావర్ అలీ ఒప్పుకున్నాడు. ఏపీ-ఒడిశా సరిహద్దు నుంచి గంజాయి తెచ్చి వ్యాపారం చేస్తున్నామని పోలీసులు విచారణలో తెలిపినట్లు సమాచారం అందుతుంది.

Spread the love