కుంభం సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు…

–  రెడ్లరేపాక గ్రామానికి చెందిన 300 మంది కారుని వీడి కాంగ్రెస్ లోకి
నవతెలంగాణ భువనగిరి రూరల్: వలిగొండ మండలం ఎదుల్లగూడెం లోగల ఎంఎంఎస్ గార్డెన్స్ లో రెడ్లరేపాక గ్రామానికి చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరగా, వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకి పెరుగుతుందని ఇది శుభ సంకేతమని, అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారం లోకి తీసుకురావాలని కాంగ్రెస్ శ్రేణులని కోరారు. పార్టీలో చేరిన వారిలో జెడ్పిటిసి గా పోటీ చేసిన అభ్యర్థి గుర్రం లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ నోముల మల్లేష్ యాదవ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ కందుల శ్రీను, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ జహంగీర్, పదవ వార్డు సభ్యులు కోమిరెల్లి శంకర్ రెడ్డి, రెండవ వార్డ్ సభ్యులు దేశబోయిన బాలమ్మ, తొమ్మిదవ వార్డు సభ్యులు గాడిపల్లి సంతోష -రమేష్ లు కాంగ్రెస్లో చేరారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, సిపిఐ నాయకులు ముఖ్య పార్టీ నాయకులు, మండల ఇంచార్జులు,మండల సీనియర్ నాయకులు, మహిళ విభాగం సభ్యులు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love