శ్రీలక్ష్మీ నారాయణ ఆలయ భూములకు భారీ కౌలు ఆదాయం

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లీలో గల శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ భూములు ఉగాది రోజున మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు ఆలయ ఆవరణంలో కౌలు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాట తాత్కాలిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా వ్యవసాయదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆలయానికి చెందిన సాగుభూమి మూడు చోట్ల ఉంది ఆ మూడు చోట్ల కలిసి ఏడు ఎకరాల 26 గుంటలు ఉండగా వీటికి కౌలు వేలంపాట నిర్వహించగా మొదట నాలుగు ఎకరాల 14 గుంటలకు వేలంపాట నిర్వహించగా దోస వార్ రాజు అనే వ్యక్తి ఒక లక్ష పదివేల రూపాయలకు దక్కించుకున్నారు. అదేవిధంగా ఒక ఎకరం 34 గుంటల భూమికి కౌలు వేలంపాట నిర్వహించగా ఈ భూమికి బండి వార్ హనుమాన్లు అనే వ్యక్తి  54 వేలకు దక్కించుకున్నారు. ఇక ఒక ఎకరం 18 గుంటల భూమికి వేలంపాట వేయగా కొటార్ వార్ సాయిలు అనే వ్యక్తి 32 వేలకు దక్కించుకున్నారు. ఈ విధంగా మూడు చోట్ల గల సాగు భూమికి మొత్తం 1,96 వేల రూపాయలు కౌలు ఆదాయం వచ్చింది ఇక ఆలయానికి చెందిన రెండు షెటర్లు వేలంపాట నిర్వహించగా ఆ రెండింటికి కలిసి 15,500 వేలం పాట పాడింది ఒకటి బండివార్ గంగారం మరొకటి పడమటివార్ సాయిలు దక్కించుకున్నారు. కౌలు ఆదాయం రెండు షట్టర్ల ఆదాయం కలిసి మొత్తం రూ.2,11,500 లక్ష్మి నారాయణ ఆలయానికి ఆదాయం సమకూరడంతో గల్లి వాసులు సంతోషపడ్డారు. ఈ వేలం పాట ఆలయ తాత్కాలిక చైర్మన్ చాట్ల గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించగా గ్రామంలోని పలువురు గ్రామ పెద్దలు వ్యవసాయదారులు గల్లి వాసులు పాల్గొన్నారు.
Spread the love