వైజాగ్ సాగర్ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పాము కళేబరం

 

నవతెలంగాణ – వైజాగ్: మంగళవారం ఓ భారీ పాము కలేబరం వైజాగ్ బీచ్ తీరానికి కొట్టుకువచ్చింది. వైజాగ్ పరిధిలోని సాగర్ నగర్ బీచ్ దగ్గర్లో ఈ భారీ పాము కలేబరం కనిపించింది. సముద్రంలో అరుదుగా కనిపించే ఈ పామును నల పాముగా పిలుస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారుల వలలకు చిక్కిన పామును తిరిగి సముద్రంలో విడిచిపెట్టే క్రమంలో ఇది చనిపోయి ఉంటుందని చెప్పారు. వలలో చిక్కుకోవడంతో భయాందోళనకు గురై ఈ పాములు చనిపోతాయని వివరించారు. ఈ భారీ పాము కలేబరాన్ని చూసేందుకు చుట్టుపక్కల వారు గుడ్లవాని పాలెం అమ్మవార్ల ఆలయాల తీరానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ గా మారాయి.

 

Spread the love