భార్యను చంపి భర్త ఆత్మహత్య

శంకర్‌పల్లిలోని జన్వాడ గ్రామంలో ఈ ఘటన
నవతెలంగాణ-శంకర్‌పల్లి
కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకర్పల్లి మండలంలోని శనివారం జన్వాడ గ్రామంలో జరిగింది. నార్సింగి సీఐ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జిల్లాకు చెందిన నాగరాజు (35) భార్య సుధారాణి (30) ఇద్దరు పిల్లలతో కలిసి ఏడాది క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో అద్దెకు ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. నాగరాజు ఆర్‌.ఎం.పి డాక్టర్‌గా మిర్జాగూడ, పంచాయతీ పరిధిలోని మియాన్‌ఖాన్‌ గడ్డ గ్రామాల్లో పని చేస్తున్నాడు. దీంతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగి స్తున్నాడు. కాగా కుటుంబ కలహాలతో భార్యాభర్తలు పోట్లాడుకున్నారు. భర్త నాగరాజు ఆవేశంతో కొబ్బరి బోం డాలు కొట్టే కత్తితో భార్య సుధారాణి మెడపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగా మరో కత్తితో ఆమెను పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తాను కూడా వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు పెద్దకొడుకు దీక్షిత్‌ను కూడా చంపడానికి ప్రయత్నం చేయగా ఆ బాలుడు తప్పించుకుని తమ్మునితో బయటకి పరిగెత్తాడు. దీంతో ఆ బాలుడు చావు నుంచి తప్పించుకున్నాడు. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీలకు సమాచారం అందించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, నార్సింగ్‌ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్ట నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ వేరకు నార్సింగ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు‌న్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. దీంతో పిల్లలను చూసిన గ్రామస్తులందరూ కంటతడి పెట్టారు.

Spread the love