మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

నవతెలంగాణ – నంద్యాల
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కనకాద్రి పల్లెలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. వడ్డే రమణ తాగుడుకు బానిసగా మారాడు. భార్య సుగుణమ్మ (48)తో తరచూ గొడవలు జరిగేవి. కోపం పెంచుకున్న వడ్డే రమణ నిద్రిస్తున్న సుగుణమ్మను గొడ్డలితో నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రమణపై కేసు నమోదు చేశారు.

Spread the love