నవతెలంగాణ – అశ్వారావుపేట : ఆసుపాక కాలనీకి చెందిన పింగిళి రాముకు చెందిన పూరి గుడిసె మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి అంటు కోవడంతో సర్వస్వం ఆహుతి అయింది. గమనించిన చూట్టు పక్కల వారు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించి, మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ వచ్చే సరికి ఇళ్లంతా దగ్ధమైంది. కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లగా, చిన్నారులు పాఠశాలకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రూ.50 వేల నగదుతో పాటు సామగ్రి, దుస్తులు అన్నీ కాలి బూడిద కావడంతో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోతున్నాడు.