హైద‌రాబాద్ మెట్రో సరికొత్త రికార్డు..

నవతెలంగాణ – హైద‌రాబాద్‌: హైద‌రాబాద్ మెట్రో రైలు రికార్డు క్రియేట్ చేసింది. జూలై 3వ తేదీన  మెట్రో రైలులో 5 ల‌క్ష‌ల 10 వేల మంది ప్ర‌యాణికులు ట్రావెల్ చేశారు. ఒక్క రోజే ఇంత భారీ స్థాయిలో ప్ర‌యాణికులు కొత్త రికార్డు. నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీ న‌గ‌ర్ నుంచి కూక‌ట్‌ప‌ల్లి రూట్లో భారీ సంఖ్య‌లో ప్ర‌యాణికులు ట్రావెల్ చేశారు. ఇప్పటి వరకు హైద‌రాబాద్ మైట్రోరైలు 40 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో ఇటీవ‌ల ప్ర‌యాణికులు సంఖ్య పెరిగింది.

Spread the love