నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో నగర వాసులకి శుభవార్త చెప్పింది. కేబీఆర్ పార్కులో ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే వారిని దృష్టి లో పెట్టుకుని కీలక ప్రకటన చేయడం జరిగింది. ఉదయం 6 నుండి 8 గంటల మధ్య రాత్రి 8 నుండి 12 గంటల మధ్య మెట్రో లో ప్రయాణించే వారికి స్మార్ట్ కార్డు పై 10 శాతం రాయితీ ప్రకటించింది. నగరంలో ఎక్కడ నుండి అయినా మెట్రో లో ప్రయాణించి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ లో దిగే వారికి సూపర్ అవర్స్ సమయం లో రాయితీ ని ఇస్తున్నట్టు మెట్రో అధికారులు చెప్పారు కేబీఆర్ పార్క్ కి వాకింగ్ కోసం వచ్చేవాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మెట్రో అధికారులు చెప్పారు.