సమయాలను పెంచిన హైదరాబాద్ మెట్రో..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయాలను పెంచారు. నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం రైళ్ల సమయాలను పొడిగించారు. మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో చివరి మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు మొదలై 1 గంటకు గమ్యస్థానాలకు చేరుకుంటాయి.  ఈరోజు సాయంత్రం ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంటుంది. వీకెండ్స్, సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శనకు అవకావం ఉంటుంది. ఈ సమయాన్ని మరింత పెంచే అవకాశం కూడా ఉంది.

Spread the love