విహారయాత్ర విషాదాంతం…హైదరాబాదీ యువకుడు మృతి

నవతెలంగాణ హైదరాబాద్: విహారయాత్ర విషాదాంతమైంది. కర్ణాటకలోని ఓ జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి హైదరాబాద్‌ యువకుడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్‌ (25) ఇటీవల తన స్నేహితుడితో కలిసి చిక్కమగళూరు టూర్‌కు వచ్చాడు. వీరిద్దరూ బైక్‌ అద్దెకు తీసుకుని కొన్ని పర్యటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం వద్దకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తుండటంతో జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈత రానప్పటికీ వీరిద్దరూ ఇక్కడ సెల్ఫీ కోసం ప్రయత్నించి కాలుజారి నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వీరిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అయితే, నీటిలో జారినప్పుడు శ్రవణ్ తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందిన వైద్యులు వెల్లడించారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలో సిస్టమ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love