నవతెలంగాణ – హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘రంగనాథ్ అత్యుత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఆయన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సామాన్యుల ఇళ్లు కూలుస్తున్నారు. కానీ పెద్దల జోలికి వెళ్లడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. కవిత విడుదలను రాజకీయం చేయొద్దని, ఆమెపై అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. కవిత విషయంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయం చేయడం సరికాదన్నారు.