నవతెలంగాణ – హైదరాబాద్: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఆఫ్‌లైన్‌లో బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.