మురళీమోహన్ జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు..

Hydra notices to Murali Mohan Jayabheri's organization.నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని రంగాళ్‌కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగాళ్‌కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొంది. హైడ్రా నోటీసులపై జయభేరి సంస్థ స్పందించాల్సి ఉంది. మరోవైపు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు. హైదరాబాద్‌లోని పలు చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇందులో భాగంగా కొన్నిరోజుల క్రితం మాదాపూర్‌లో తుమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ హాలును హైడ్రా కూల్చివేసింది. దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది.

Spread the love