నవతెలంగాణ-హైదరాబాద్ : జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది చట్టబద్ధమైనదే. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుంది. విశేష అధికారాలు కూడా రాబోతున్నాయి. 6 వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుంది. మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తాం. గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది’’ అని రంగనాథ్ తెలిపారు.