నేను..కీర్తన

నేను..కీర్తనచిమటా రమేష్‌ బాబు హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను కీర్తన’. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దర్శకుడు, నిర్మాత సాయి రాజేష్‌ ఆకాంక్షించారు. ఈ చిత్రంలోని ‘సీతాకోకై ఎగిరింది మనసే’ లిరికల్‌ వీడియోను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి సక్సెస్‌ కళ కనిపిస్తోంది. కులుమనాలిలో చిత్రీకరించిన ఈ పాట చాలా బాగుంది. చిమటా రమేష్‌బాబుకి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. చిమటా ప్రొడక్షన్స్‌ పతాకంపై చిమటా రమేష్‌ బాబు, రిషిత, మేఘన హీరో, హీరోయిన్లుగా చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం ‘నేను-కీర్తన’. ‘మల్టీ జోనర్‌ ఫిల్మ్‌గా తెరకెక్కి, సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్‌ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి బిజినెస్‌ పరంగానూ మంచి క్రేజ్‌ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు ఆరు రోప్‌ ఫైట్స్‌ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని దర్శకుడు చిమటా రమేష్‌బాబు చెప్పారు.

Spread the love