చంద్రబాబు నాయుడు అనే నేను..

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్టీఏ కూటమి సర్కారు కొలువుదీరింది. సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయంతో విజయదుదుంభి మోగించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వేదికగా ఉదయం 11.27 నిమిషాలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్‌జన్ శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, రాందాస్ అథవాలె హాజరయ్యారు. ఇక ప్రముఖుల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర సీఎ ఏక్‌నాథ్ షిండే, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, ఎంపీ ఈటల రాజేందర్, సీనీ ప్రముఖులు చిరంజీవి, రజినీకాంత్, రాంచరణ్, నాగబాబు, తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా వెదికపై అక్కాచెల్లెల్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురందేశ్వరి, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Spread the love