సిద్ధిపేట జిల్లాలో పనిచేయడం సంతోషంగా ఉంది

– జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ – చిన్నకోడూరు
రైతుల జీవితంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. 2014లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి నీళ్ల మంత్రిగా హరీశ్ రావు అలుపెరుగకుండా బాగా కష్టపడ్డారన్నారు. అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ హోదాలో తానూ మంత్రి హరీశ్ రావు దేవాదుల గురించి గంటల కొద్ది సమీక్షలు పెట్టి అధికార యంత్రాంగంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో పనులు వేగవంతం చేశారని తెలిపారు. నాటి నీళ్ల మంత్రి హోదాలో ఆయన పనితనం 2015లోనే దగ్గరగా ఉండి ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. ఇప్పుడు మళ్లీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లాలో పనిచేయడం సంతోషంగా ఉన్నదని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వెల్లడించారు. మంత్రి హరీశ్ రావు చిత్తశుద్ధిని చూసి నేను ఎంతో నేర్చుకున్నాననీ, ఆయన వర్కింగ్ స్టైల్ తీరు వైరటీగాగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ వెల్లడించారు.

Spread the love