నవతెలంగాణ – హైదరాబాద్: ఒడిశా అసెంబ్లీలో తానే ప్రతిపక్ష నేతగా ఉంటానని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారు. పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. బీజేడీ ఎమ్మెల్యేలంతా తనను బీజేడీ సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. 24 ఏళ్ల పాటు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ ఇటీవల అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. 78 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.