ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌ సురమా పాది ప్రతిపక్ష నేతగా నేనే : నవీన్‌ పట్నాయక్‌

ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌ సురమా పాది ప్రతిపక్ష నేతగా నేనే : నవీన్‌ పట్నాయక్‌ఒడిశా: భువనేశ్వర్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఒడిశా అసెంబ్లీ స్పీకర్‌ సురమా పాధి బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీలో ఆమె బాధ్యతలు స్వీకరించేటపుడు ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ, ప్రతిపక్ష నేత, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ అభినందనలు తెలిపారు. ఒడిశా అసెంబ్లీలో తానే ప్రతిపక్ష నేతగా ఉంటానని మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపారు. బీజేడీ ఎమ్మెల్యేలంతా తనను బీజేడీ సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. 24 ఏండ్ల పాటు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ ఇటీవల అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. 78 సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Spread the love