నేను వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కొడుకుని..యాత్ర-2 మోషన్‌ పోస్టర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి జీవించేశాడు. ఇక అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు. కాగా తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ను ఓ పోస్టర్‌తో అనౌన్స్‌చేశారు. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నేను వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కొడుకుని అంటూ ఓ డైలాగ్‌ను యాడ్‌ చేసి పోస్టర్‌ను వదిలారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక శనివారం వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్‌ఆర్‌ చెప్పిన మాటలతో వీడియో స్టార్ట్‌ అయింది. చివర్లో నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్‌తో మోషన్‌ పోస్టర్‌ను కంప్లీట్‌ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రంగం నటుడు జీవా.. జగన్‌ మోహన్‌ రెడ్డి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది.

Spread the love