నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు నమోదు చేసిన ఛార్జ్ షీట్‌పై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని, తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని అన్నారు. ‘డ్రగ్స్ రిపోర్టులో నెగటివ్ అని ఛార్జ్ షీట్‌లో పోలీసులు పేర్కొన్నట్లు నాకు సమాచారం ఉంది. కొన్ని మీడియా సంస్థల వల్ల నా పేరును అందులో చేర్చారు’ అని ఆమె తాజాగా మీడియాకు తెలిపారు. ఛార్జ్ షీట్ తన చేతికొచ్చాక మళ్లీ స్పందిస్తానన్నారు.