ఇలాంటి దుర్మార్గమైన సీఎంను చూడలేదు

–  కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ధరణి పోర్టల్‌తో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ధరణిని సీఎం సమర్థించుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన సీఎం తాను చూడలేదని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ధరణి ఎత్తేస్తామంటూ కాంగ్రెస్‌ చెబుతున్నదని నిజమే కానీ ఐదేండ్ల నుంచి ధరణిపై ఎన్నడూ మాట్లాడని కేసీఆర్‌ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. డిఫాల్టర్‌ అయిన కంపెనీకి ఇంత కీలకమైన ధరణి బాధ్యత ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. భూములు సర్వే చేయాలనీ, టైటిల్‌ గ్యారంటీ చట్టం చేయాలంటూ కేంద్రం చెబుతుంటే అవి చేయకుండా కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు.

Spread the love