నేను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి : ఏపీ డిప్యూటీ సీఎం

నవతెలంగాణ-మైదరాబాద్ : ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదని, అయితే 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని గుర్తుచేసుకున్నారు. ‘‘రామోజీరావు ప్రజల పక్షపాతి… జర్నలిస్టు విలువను కాపాడటంలో ముందున్నారు. ప్రజల కోసం ఏం చేయాలనే అంశాలపైనే ఆలోచించారు. 2019లో నన్ను లంచ్ మీటింగ్‌కు రామోజీరావు ఆహ్వానించారు. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు, పత్రికా రంగం గురించి మా మధ్య చర్చ సాగింది’’ అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.

Spread the love