నవతెలంగాణ – చైన్నై: కరోనా తర్వాత ఓటీటీ ట్రెండ్ జోరందుకుంది. కేవలం వాటి కోసమే వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో పెద్దగా ఆడని సినిమాలు కూడా ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ఓటీటీ గురించి తమిళ స్టార్ హీరో కమల హాసన్ దాదాపు పదేళ్ల కిందటే ఆలోచించారు. తన సినిమాను నేరుగా కొంత రుసుముతో టీవీల్లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో కమలహాసన్ మాట్లాడుతూ, ‘‘ఓటీటీ వ్యవస్థ వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. దీని కోసం ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాను. కానీ ఆ సమయంలో సినిమా పరిశ్రమలోని వారంతా నా మాటలను పట్టించుకోలేదు. నా ఆలోచనలను అంగీకరించలేదు. కానీ ఈ రోజు వారికి అర్థమైంది’’ అని అన్నారు. దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో కమలహాసన్ మాట్లాడుతూ, ‘‘ఓటీటీ వ్యవస్థ వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను. దీని కోసం ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాను. కానీ ఆ సమయంలో సినిమా పరిశ్రమలోని వారంతా నా మాటలను పట్టించుకోలేదు. నా ఆలోచనలను అంగీకరించలేదు. కానీ ఈ రోజు వారికి అర్థమైంది’’ అని అన్నారు.