మీ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను: ఎన్టీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్
యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తనను విష్ చేసిన ప్రతి ఒక్కరికీ తారక్‌ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ఇన్నేళ్ల కెరియర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ నా అభిమానులు మాత్రం నాకు సపోర్ట్‌ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు నేను నటించిన ప్రతి పాత్ర, చేసిన ప్రతి సినిమా నా అభిమానుల కోసమే చేశా. నన్ను, నా సినిమాలను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని చెప్పారు. ‘దేవర’ ఫస్ట్‌ లుక్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు.

Spread the love