చేయి తెగిన జవాన్‌ను కాపాడిన ఐఏఎఫ్‌..

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఒక సైనికుడు మెషిన్‌ ఆపరేట్‌ చేస్తుండగా చేయి తెగింది. కాగా, ఆర్మీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఐఏఎఫ్‌ వెంటనే స్పందించింది. చేయి తెగిన జవాన్‌ను కాపాడేందుకు నడి రాత్రి వేళ డేరింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఆ జవాన్‌ను సీ-130జే విమానంలో లడఖ్‌ నుంచి ఢిల్లీకి తరలించారు. దీంతో డాక్టర్లు ఎనిమిది గంటలు శ్రమించి సర్జరీ ద్వారా తెగిన చేతిని అతికించారు.
Spread the love