భారత్ ఆడే మ్యాచ్ లపై ఐసీసీ కీలక నిర్ణయం..

నవతెలగాణ – హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి మరో మూడ్రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇది వన్డే ఫార్మాట్ లో జరిగే టోర్నీ. కాగా, ఈ మెగా ఈవెంట్ లో భారత్ ఆడే మ్యాచ్ ల విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఈ టోర్నీలో ఆడే మ్యాచ్ లకు అదనపు టికెట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. హైబ్రిడ్ మోడ్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు గ్రూప్-ఏలో ఉంది. భారత్ ఈ నెల 20న బంగ్లాదేశ్ తో, ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో, మార్చి 2న న్యూజిలాండ్ జట్టుతో లీగ్ దశ మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లకు ఇప్పటికే టికెట్లనువిడుదల చేసిన ఐసీసీ… తాజాగా అదనపు టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. టీమిండియా ఫ్యాన్స్ కు ఇది నిజంగా శుభవార్తే

Spread the love