వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ దన్ను

నవతెలంగాణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వినాశకరంగా వరదలు వచ్చినపడిన నేపథ్యంలో, ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన ఐసిఐసిఐ లాంబార్డ్, బాధిత కుటుంబాలకు మనఃపూర్వక సంతాపాన్ని తెలుపుతూ, సవాలుగా నిలిచిన ఈ కాలంలో ఈ రాష్ట్రాల ప్రజలకి మద్దత్తుగా నిలుస్తోంది. ఈ కష్టకాలంలో, తన ఖాతాదారులు, విస్తృత సమాజ శ్రేయస్సుకు ఐసిఐసిఐ మొక్కవోని దీక్షతో కట్టుబడి వుందని ప్రకటిస్తోంది. స్థానిక అధికారులు, అత్యవసర సేవల వారికి సమాచారం అందిస్తూ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తమ తక్షణ అవసరాలని తీర్చుకోడానికి కీలకమైన సరఫరాలు సిద్ధంగా అందుబాటులో వుండేలా చూసుకోవాలని ప్రభావిత ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలని మేం కోరుకుంటన్నాం.
ఇలాంటి ప్రకృతి విపత్తులు ఊహించని నష్టాలకి, నాశనాలకి దారితీస్తాయని ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ గ్రహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, వరదల వల్ల ప్రభావితమైన పాలసీదారులకి తక్షణ మద్దతు, సహాయం అందించేందుకుగాను, మేం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గడ్డు కాలంలో, దిశానిర్దేశం చేసి, క్లెయిములు ఇబ్బందులు లేకుండా పరిష్కరించుకునేలా సాయపడేందుకు మా బృందం 24*7 అందుబాటులో  వుంటుంది. తక్షణ మద్దత్తు, మార్గదర్శనం కోసం, ఈ క్రింది చానెల్స్ ద్వారా దయచేసి ఐసిఐసిఐ లాంబార్డ్ ని  సంప్రదించగలరు:

  • టోల్-ఫీ కాంటాక్ట్ నెం: 1800-2666
  • ఇమెయిల్: [email protected]

ఈ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల్లో మా పాలసీదార్లకి, సమాజాలకి మద్దతుగా నిలిచేందుకు ఐసిఐసిఐ లాంబార్డ్ కట్టుబడి వుంది. మేం పరిస్థితిని సన్నిహతంగా పర్యవేక్షిస్తూ, అవసరమైన మేరకు మా మద్దతుని అనుగుణంగా మార్చుకుంటాం.

Spread the love