రాణించిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌

ముంబయి : గ్యారెంటీ బెనిఫిట్‌ ఉత్పత్తుల విక్రయంలో 158 శాతం వృద్థిని నమోదు చేసినట్లు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తెలిపింది. హామీ ఇవ్వబడిన ప్రయోజన ఉత్పత్తులకు పెరుగుతున్న వినియోగదారుల ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని ఆ సంస్థ పేర్కొంది. 2019-20 నుంచి 2022-23 మధ్య కాలంలో హామీ ఇవ్వబడిన పొదుపు ఉత్పత్తుల విభాగంలో 158 శాతం పెరుగుదలను నమోదు చేశామని ఆ సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ హెచ్‌ పేర్కొన్నారు.

Spread the love