హైదరాబాద్: ఆయుధాలకు సంబంధించి ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ప్రదర్శన మిలి పోల్ ఇండియా 2023లో ఐకామ్ – కారకాల్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ ఎక్సిబిషన్ ఈ నెల 26 నుంచి 28 వరకు ఢిల్లీలోని ప్రగతిమైదాన్‌లో జరిగిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ఆయుధ నమూనాలు డిఫెన్స్ రంగంలోని సంస్థలు, అందులో నైపుణ్యం ఉన్న ప్రముఖులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఆత్మనిర్బార్ భారత్, మేక్ ఇన్ ఇండియా పథకాల్లో భాగంగా అత్యాధునికమైన సబ్ మెషిన్ గన్స్, పిస్టల్స్, రైఫిల్స్‌ను తయారు చేసేందుకు ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్, ఎంఇఐఎల్ గూప్ సంస్థ ఐకామ్ గతంలో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తమ ఉత్పత్తుల ప్రదర్శనకు మిలిపోల్ ఇండియా 2023 ఎంతో ఉపయోగపడిందని కారకాల్ సిఇఒ హమద్ ఆల్ అమేరి పేర్కొన్నారు.