– హైదరాబాద్ చాప్టర్ 50 ఏండ్ల వ్యవస్థాపక దినోత్సవం
హైదరాబాద్: ది ఇన్స్‌ట్యూట్ ఆప్ కంపెనీ సె్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్‌ఐ) హైదరాబాద్ చాప్టర్ ఘనంగా 50 ఏళ్ల వ్యవస్థాపక దినోత్సవాలు, గోల్డెన్ జూబ్లీ ఇయర్‌ను నిర్వహించుకుంది. నగరంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం విశేషం. గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్బంగా తమ విద్యార్థులు ఆగస్టు 1 నుంచి 15వ తేది వరకు పలు వైద్య క్యాంప్‌లు, రక్తదానం, పారిశ్రామిక సందర్శనలు చేపడుతున్నారని ఐసిఎస్‌ఐ మైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ సిఎస్ గామిని శ్రీ లక్ష్మీ నారాయణ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిఎస్‌ఐ ప్రతినిధులు రాజవోలు వెంకటరమణ్, మహదేవ్ తిరినగరి, శిల్పా బుంగ్, లలితా దేవి తంగిరాల తదితరులు పాల్గొన్నారు.