సరికొత్త అనుభూతినిచ్చే రహస్యం ఇదమ్‌ జగత్‌

Idam Jagat is the secret to a new experienceకొత్తదనం ఉన్న చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైన అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జోనర్‌లోనే రాబోతున్న చిత్రం ‘రహస్యం ఇదమ్‌ జగత్‌’. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రమిది. సింగిల్‌ సెల్‌ యూనివర్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావి నూతుల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్ర డేట్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు. మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకుని ఈ చిత్రం రూపొందించినట్లుగా గ్లింప్స్‌ చెప్పకనే చెబుతోంది. ముఖ్యంగా మన శ్రీచక్రం గురించి చెబుతున్న పాయింట్‌ అందరికి గూజ్‌బంప్స్‌ తీసుకొచ్చే విధంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని ఈ గ్లింప్స్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. గ్లింప్స్‌తోనే అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.

Spread the love