నవతెలంగాణ – తిరువనంతపురం : వయనాడ్ కొండచరియల బాధితుల పునరావాసం కోసం ఐడీబీఐ బ్యాంక్ కోటి రూపాయిల చెక్కును ఐడీబీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జయకుమార్ ఎస్ పిళ్లై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందజేశారు. బ్యాంక్ కొచ్చి జోన్ సీజీఎం రాజేష్ మోహన్ ఝా, జనరల్ మేనేజర్లు టామీ సెబాస్టియన్, ఎం.సి. సునీల్ కుమార్, రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బిందు వీసీ పాల్గొన్నారు. ఐడీబీఐ బ్యాంక్ కేరళలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. దీనిపై జయకుమార్ ఎస్.పిళ్లై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.